: పెళ్లి పీటలు ఎక్కనున్న హీరో వరుణ్ సందేశ్... 7న నిశ్చితార్థం
తన పెళ్లి గురించి వస్తున్న వార్తలకు యంగ్ హీరో వరుణ్ సందేశ్ ఫుల్ స్టాప్ పెట్టాడు. తన ప్రియురాలు వితికా షేరును పెళ్లాడబోతున్నట్టు స్వయంగా ప్రకటించాడు. డిసెంబర్ 7వ తేదీన నిశ్చితార్థం జరగబోతోందని ట్విట్టర్ ద్వారా తెలిపాడు. అంతేకాకుండా, వితికాతో కలసి దిగిన ఫొటోను కూడా షేర్ చేశాడు. 'పడ్డానండీ ప్రేమలో మరి' సినిమాలో వరుణ్ సందేశ్ కు జోడీగా వితికా షేరు నటించింది. ఆ తర్వాత వీరిద్దరూ నిజంగానే ప్రేమలో పడిపోయారు. వీరిద్దరూ పెళ్లాడబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగినప్పటికీ... ఆ విషయాన్ని వీరు ధ్రువీకరించలేదు. వరుణ్ తాజా ట్వీట్ తో ఊహాగానాలకు తెరపడినట్టయింది.