: బాక్సైట్ కంపెనీల బినామీగా జగన్ ఉన్నారా?... అయితే కేసు పెట్టండి: మాజీ ఎంపీ ఉండవల్లి
విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడం, ఆ తర్వాత గిరిజనుల నిరసనతో వెనకడుగు వేయడంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కొద్దిసేపటి క్రితం ఆయన మీడియాతో మాట్లాడారు. బాక్సైట్ గనుల వ్యవహారంలో ప్రభుత్వ తీరు వాస్తవాలు దాస్తున్నట్లుగా ఉందని ఆయన ఆరోపించారు. కేబినెట్ లోని కొందరు మంత్రులు ఆరోపిస్తున్నట్లు బాక్సైట్ కంపెనీల బినామీగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నట్లైతే, ఆయనపై తక్షణమే కేసులు పెట్టాలని కూడా ఉండవల్లి డిమాండ్ చేశారు.