: 'అసహనం' భారత దేశ డీఎన్ఏలోనే లేదు: టీఆర్ఎస్ ఎంపీ ఉద్ఘాటన
దేశవ్యాప్తంగా పెను చర్చనీయాంశంగా మారిన అసహనంపై తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ గళం విప్పింది. పార్లమెంటు సమావేశాల్లో భాగంగా ఆ పార్టీ నేత, భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కొద్దిసేపటి క్రితం ఢిల్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. భారత దేశ డీఎన్ఏలోనే అసహనం అన్న పదానికి తావు లేదని ఆయన పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసమే కొందరు అసహనాన్ని తెర మీదకు తెస్తున్నారని ఆయన ఆరోపించారు. రాజకీయాల కోసం ప్రజలను విడదీయొద్దని కూడా ఆయన అన్నారు. అయినా అసహనం రాజకీయ పార్టీల మధ్యే ఉంది కానీ, ప్రజల మధ్య లేదని నర్సయ్యగౌడ్ వ్యాఖ్యానించారు.