: మోదీ, షరీఫ్ భేటీని స్వాగతించిన ఐరాస అధ్యక్షుడు
ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో జరిగిన వాతావరణ అంతర్జాతీయ సదస్సు వేదికగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పాకిస్థాన్ పీఎం నవాజ్ షరీఫ్ కలుసుకోవడాన్ని ఐక్యరాజ్యసమితి అధ్యక్షుడు బాన్ కీ మూన్ స్వాగతించారు. వారిద్దరి మధ్య భేటీ ఆహ్వానించదగిన పరిణామమన్నారు. స్వల్ప వ్యవధిలో ఇద్దరు ప్రధానుల సంభాషణ భారత్, పాక్ మధ్య సమస్యలను పరిష్కరించేందుకు చిన్న మార్గాన్ని ఏర్పరిచినా తాను ఎంతో సంతోషిస్తానని బాన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన అధికారిక ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు.