: వివాదాలకు దూరంగా ఉండమని వెంకయ్యనాయుడు చెప్పారు: ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ


అధికార పక్ష నేతలు మాట్లాడేటప్పుడు తమ భాషపై నియంత్రణ కలిగి ఉండాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తమకు సూచించినట్టు మరో కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. ఈ ఉదయం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసిన తర్వాత నఖ్వీ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. వివాదాలకు దూరంగా ఉండాలని, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే ప్రధాని మోదీ అభివృద్ధి ఎజెండాపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని వెంకయ్య చెప్పారని తెలిపారు. అసహనంపై రాజకీయ చర్చలు, ఇటీవల ముగిసిన బీహార్ ఎన్నికల గురించి సమావేశంలో చర్చించామని చెప్పారు.

  • Loading...

More Telugu News