: సికింద్రాబాద్ లో బీభత్సం సృష్టించిన సిలిండర్ల లారీ
సికింద్రాబాదులో ఓ సిలిండర్ల లారీ బీభత్సం సృష్టించింది. అదుపుతప్పిన లారీ ఓ ద్విచక్ర వాహనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళుతున్న యువకుడు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన ఆనంద్ సినిమా థియేటర్ వద్ద జరిగింది. ప్రమాదం కారణంగా వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ప్రమాదంలో దుర్మరణం పాలైన యువకుడిని సందీప్ గా గుర్తించారు. బేగంపేటలోని ఓ కాల్ సెంటర్ లో అతను పని చేస్తున్నాడు.