: ఆరెస్సెస్ నేతలు స్వలింగ సంపర్కులు...అందుకే వారు పెళ్లి చేసుకోరు!: ఆజం ఖాన్ సంచలన వ్యాఖ్యలు


వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత, ఉత్తరప్రదేశ్ మంత్రి ఆజం ఖాన్ ఈసారి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) నేతలపై గురి పెట్టారు. ఆరెస్సెస్ నేతలను స్వలింగ సంపర్కులుగా అభివర్ణించిన ఆయన, ఈ కారణంగానే ఆరెస్సెస్ నేతలు పెళ్లి పెటాకులు లేకుండా కాలం వెళ్లదీస్తున్నారని వ్యాఖ్యానించారు. హోమో సెక్సువాలిటీకి సంబంధించి ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆజం ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. వీటిపై ఆరెస్సెస్ తో పాటు విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) నేతలు భగ్గుమన్నారు. మతి స్థిమితం లేని కారణంగానే ఆజం ఖాన్ ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని వారు ఒంటికాలిపై లేచారు.

  • Loading...

More Telugu News