: టీడీపీ, వైసీపీల మధ్య ఫైటింగ్... మోర్త గ్రామంలో 144 సెక్షన్


ఏపీలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీల మధ్య మరోమారు ఘర్షణ చోటుచేసుకుంది. ఎన్నికలు ముగిసిన నాటి నుంచి గ్రామ స్థాయిలోని ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తరచూ గొడవలు తలెత్తుతున్న విషయం తెలిసిందే. ప్రధానంగా రాయలసీమ జిల్లాల్లో ఈ తరహా ఘర్షణలు చోటుచేసుకున్నా, తాజాగా కోస్తాంధ్రలో ఇరు పార్టీల కార్యకర్తలు కొట్టుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం మోర్తలో నిన్న రాత్రి ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రెండు వర్గాలు పరస్పరం దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడుల్లో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన గ్రామానికి చేరుకుని గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ప్రస్తుతం గ్రామం నివురుగప్పిన నిప్పులానే ఉంది. ఘర్షణకు గల కారణాలు తెలియరాలేదు.

  • Loading...

More Telugu News