: హైదరాబాద్-కోల్ కతా ఫ్లైట్ లో ప్రయాణికుడికి ఛాతీ నొప్పి


ఈరోజు హైదరాబాద్ నుంచి కోల్కతా వెళ్తున్న ఓ విమానంలో ఓ ప్రయాణికుడికి ఛాతినొప్పి వచ్చింది. దీంతో భువనేశ్వర్లోని బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్ చేశారు. అస్వస్థతకు గురైన ప్రయాణికుడిని చికిత్స నిమిత్తం భువనేశ్వర్లోని ఓ ఆస్పత్రికి తరలించినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. అస్వస్థతకు గురైన ప్రయాణికుడిని శశి మీనన్గా గుర్తించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్టు సమాచారం. సుమారు అరగంట సమయం తర్వాత విమానం కోల్కతాకు బయల్దేరింది.

  • Loading...

More Telugu News