: క్లింటన్ నన్ను ప్రలోభపెట్టాలని చూశాడు: జాన్ ఎఫ్ కెన్నడీ భార్య
యూఎస్ మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ తనను ప్రలోభ పెట్టాలని చూశాడని, అతి కష్టం మీద అతన్ని దూరంగా తోసేసానని అమెరికా 35వ అధ్యక్షుడు దివంగత జాన్ ఎఫ్ కెన్నడీ భార్య అయిన జాక్వలిన్ తాజా పుస్తకంలో వెల్లడించారు. ‘బిల్ అండ్ హ్యారీ: సో దిస్ ఈజ్ దట్ థింగ్ కాల్డ్ లవ్' అనే పుస్తకం ద్వారా బిల్ క్లింటన్ తాజా బాగోతం వెలుగు చూసింది. ఈ పుస్తకం రచయితలు డార్విన్ పార్టర్, డాన్‌ఫోర్త్ ప్రిన్స్ ఈ విషయాలను వెల్లడించారు. ఈ పుస్తకంలో క్లింటన్ గురించి ఇంకా ఆమె చెప్పిన విషయాలకు వస్తే... లైంగిక సంబంధాల విషయంలో క్లింటన్ కూడా తన భర్త జాన్ ఎఫ్ కెన్నడీ లాగా పేరుమోసిన వాడేనన్నారు. ఈ విషయంలో 'నో' అనే సమాధానం ఎదురైతే ఈ ఇద్దరూ సహించేవారు కాదని జాక్వలిన్ ఓ సందర్భంలో తన స్నేహితురాలితో చెప్పిందని ఈ పుస్తకంలో పేర్కొన్నారు. బిల్ క్లింటన్ చిన్నప్పటి నుంచి జాన్ ఎఫ్ కెన్నడీని విపరీతంగా అభిమానించేవాడని చెబుతూ, 1963లో వైట్‌హౌస్‌కు వచ్చి అప్పటి అధ్యక్షుడైన కెన్నడీని క్లింటన్ కలిసిన విషయాన్ని కూడా ప్రస్తావించారు.