: హైదరాబాద్ లో ఎల్ఈడీ లైట్ల తయారీ యూనిట్


హైదరాబాద్ లో ఎల్ఈడీ లైట్ల తయారీ యూనిట్ స్థాపనకు అమెరికా సంస్థ ముందుకొచ్చింది. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను భారత్ కు చెందిన సేల్స్ కంపెనీ సిస్కా, అడ్వాన్స్ ఆస్ట్రానిక్ డివైసెస్ (ఏవోడీ) ఇంటర్నేషనల్ కంపెనీ ప్రతినిధులు కలిశారు. ఈ యూనిట్ ఏర్పాటు నిమిత్తం 50 ఎకరాల భూమి ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ అంగీకరించారు. ఏవోడీ కంపెనీతో పాటు రూ. 5 వందల కోట్ల పెట్టుబడితో ఎల్ఈడీ లైట్ల తయారీ యూనిట్ ఏర్పాటుకు సిస్కా ముందుకొచ్చింది. రాష్ట్రంలో దాదాపు రెండువేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సిద్దంగా ఉన్నామని సిస్కా ప్రతినిధులు తెలిపారు. మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌తోపాటు అనుబంధ పరిశ్రమలు కూడా స్థాపిస్తామని ఏవోడీ, సిస్కా కంపెనీల ప్రతినిధులు చెప్పారు. మార్చి నుంచే ఉత్పత్తులు ప్రారంభించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, యూనిట్ స్థాపనకు అవసరమయ్యే భూమి, ఇతర మౌలిక సదుపాయాలను వీలైనంత త్వరగా, తక్కువ సమయంలో సమకూరుస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో పరిశ్రమల స్థాపన కోసం చేసిన టీ ఎస్ ఐపాస్ చట్టం మంచి ఫలితాలను ఇస్తోందని వివరించారు.

  • Loading...

More Telugu News