: వాతావరణ మార్పులపై పోరాడేందుకు భారత్ కట్టుబడి ఉంది: ప్రధాని మోదీ
వాతావరణ మార్పులపై పోరాడేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పారిస్ లో జరుగుతున్న వాతావరణ సదస్సు కాప్-21 శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వాతావరణ మార్పుల అంశం ప్రపంచం ముందున్న అతిపెద్ద సవాల్ అన్నారు. సాంకేతికతతో పాటు వనరులను పరస్పరం పంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మన దేశ సంస్కృతి, అభివృద్ధి గురించిన విషయాలను తెలియజెప్పే 'భారత్ పెవిలియన్' అనే విండోన్ తొలుత మోదీ ప్రారంభించారు. ఈ విండోన్ ను ప్రారంభించడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు.