: ‘రోబో’ ఉన్న తొలి తెలుగు సినిమా మాదే: ఎస్వీ కృష్ణారెడ్డి
తెలుగు చలన చిత్ర రంగంలో మొదటిసారిగా ‘రోబో’ పాత్రను ప్రవేశపెట్టిన ఘనత తమదేనని ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు. ఈ విషయాన్ని ఆయన తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా తెలిపారు. ‘టాలీవుడ్ లో మొదటి సారిగా "ఘటోత్కచుడు " (1995) సినిమాలో రోబో పాత్రను ప్రవేశపెట్టి, హీరోయిన్ రోజా, రోబోలతో ఒక సాంగ్ చిత్రీకరించినప్పటిది ఈ ఫోటో చిత్రం’ అంటూ ఫేస్ బుక్ లో పేర్కొన్నారు. దీంతోపాటు ఆ పాట చిత్రీకరణ సందర్భంలో తీసిన ఒక ఫొటోను కూడా కృష్ణారెడ్డి జతపరిచారు.