: ముంబై ఇండియన్స్ చీఫ్ మెంటార్ పదవికి గుడ్ బై చెప్పిన కుంబ్లే


భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ చీఫ్ మెంటార్ పదవి నుంచి తప్పుకున్నాడు. తక్షణమే తన నిర్ణయం అమల్లోకి వస్తుందని కుంబ్లే తెలిపాడు. 2013 జనవరి నుంచి ముంబై ఇండియా ఫ్రాంచైజీకి కుంబ్లే తన సేవలు అందించాడు. క్రికెట్ లో ఇతర బాధ్యతలను నిర్వహించేందుకే కుంబ్లే ఈ నిర్ణయం తీసుకున్నాడు. కుంబ్లే నిర్ణయంపై ముంబై ఇండియన్స్ స్పందించింది. అనిల్ కుంబ్లే చేసిన సేవలకు ధన్యవాదాలు తెలిపింది. టెస్టులు, వన్డేల్లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసుకున్న కుంబ్లే ఇంతకాలం తమతో ఉన్నందుకు సంతోషంగా ఉందని తెలిపింది. మెంటార్ గా కుంబ్లే బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఐపీఎల్ ను గెలవడమే కాక, ఛాంపియన్స్ లీగ్ లో కూడా విజయదుంధుభి మోగించామని గుర్తు చేసింది. మరోవైపు అనిల్ కుంబ్లే మాట్లాడుతూ, "ముంబై ఇండియన్స్ తో కలసి పనిచేయడం ఆనందదాయకం. గత మూడేళ్లలో ముంబై సాధించిన విజయాలు అద్భుతం. క్రికెట్ లో ఇతర వ్యవహారాల కోసం ఫ్రాంచైజీని వీడుతున్నా. అంబానీ కుటుంబానికి ధన్యవాదాలు తెలుపుతున్నా. ముఖ్యంగా నీతా అంబానీ, ఆకాశ్ అంబానీ, నిఖిల్ మేశ్వానీలు నాకు ఎంతో సపోర్ట్ చేశారు. ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు, సపోర్ట్ టీమ్ తో కలసి పనిచేయడం చాలా సంతోషాన్ని ఇచ్చింది" అని తెలిపాడు.

  • Loading...

More Telugu News