: రేపటి నుంచి టీడీపీ జన చైతన్యయాత్ర
రేపటి నుంచి తెలుగుదేశం పార్టీ జన చైతన్య యాత్రను నిర్వహించనుంది. గుంటూరు జిల్లా వేమూరు నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ యాత్రలను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఇంటింటి ప్రచారంతో పాటు ఆయా మండలాల్లో టీడీపీ సభలను నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని టీడీపీ నేతలు పేర్కొన్నారు.