: దేశవ్యాప్త సమ్మెకు విద్యుత్ ఉద్యోగులు, కార్మికుల పిలుపు


'విద్యుత్ బిల్లు-2014'కి వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారు. డిసెంబర్ 8న దేశ వ్యాప్తంగా ఒక రోజు సమ్మె చేస్తున్నట్టు తెలిపారు. ఈ విషయంపై కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ కి సమ్మె నోటీసులు ఇచ్చామని ఏఐపీఈఎఫ్ ఛైర్మన్ శైలేంద్ర దుబే చెప్పారు. రేపు ఢిల్లీలో సమావేశమై సమ్మె వ్యూహంపై చర్చించనున్నామని అన్నారు. విద్యుత్ బిల్లులో మార్పులు చేపడతామని గోయల్ చెప్పారని, శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటికీ బిల్లులో మార్పులు చేపట్టలేదని శైలేంద్ర మండిపడ్డారు.

  • Loading...

More Telugu News