: బీజేపీ వల్లే దేశంలో మత అసహనం పెరిగింది: జ్యోతిరాదిత్య సింధియా
ఓ వైపు లోక్ సభలో అసహనంపై చర్చ జరుగుతుండగానే.... ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ లో యువజన కాంగ్రెస్ మత అసహనంపై ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా బీజేపీపై ఆరోపణలు చేశారు. ఆ పార్టీ వల్లే దేశంలో మత అసహనం పెరిగిందన్నారు. 'చాయ్ పే చర్చ' అవసరం లేదని, 'ఆవు'పై చర్చ కావాలని పేర్కొన్నారు. దేశంలో జరుపుకునే పండుగల్లో మత సామరస్యం వెల్లివిరుస్తుందన్నారు. దివాలీలో అలీ, రంజాన్ లో రామ్ పదాలు ఉన్నాయన్న విషయాన్ని మర్చిపోవద్దని చెప్పారు. ఆందోళన తరువాత ప్రభుత్వానికి వ్యతరేకంగా కార్యకర్తలు నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. ఆందోళనకారులపై పోలీసులు వాటర్ కెనాన్లను ప్రయోగించారు. లాఠీఛార్జి చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు.