: గంగిరెడ్డి, చింటూ తమకు ప్రాణహాని ఉందని చెప్పటం విడ్డూరంగా ఉంది: ఏపీ డీజీపీ


ఎర్ర చందనం స్మగ్లర్ గంగిరెడ్డి, చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడు చింటూ రాయల్ తమకు ప్రాణహాని ఉందని చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని ఏపీ డీజీపీ జేవీ రాముడు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అగ్రిగోల్డ్ విషయంలో కోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు చేస్తున్నామన్నారు. అమరావతిలో అంతర్జాతీయ స్థాయి పోలీసింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నామన్నారు. అమరావతిని పోలీస్ కమిషనరేట్ గా మార్చేందుకు ప్రతిపాదనలు పంపామని చెప్పారు. సైబర్ నేరాలు తీవ్ర నేరాలుగా పరిణమిస్తున్నామని, వీటిపై ఈఎస్ఎఫ్ ల్యాబ్ తో కలిసి పోలీసులు పరిశోధన చేస్తారని అన్నారు. కాగా, 500 మంది ఎస్ఐలకు సైబర్ భద్రతపై శిక్షణ ఇస్తున్నామన్నారు. ఫ్రీజోన్ విషయమై హైదరాబాద్ లో గతంలో సమస్యలు తలెత్తాయని, అటువంటి సమస్య ఏపీలో రాకుండా ఉండేందుకుగాను అమరావతి ఫ్రీజోన్ గా ఉండాలని కోరుతూ సిఫార్సులు పంపినట్లు జేవీ రాముడు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News