: వైద్య పరీక్షల నిమిత్తం విదేశాలకు వెళ్లిన సోనియాగాంధీ


కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ వైద్య పరీక్షల కోసం మరోసారి విదేశాలకు వెళ్లారు. వారం రోజుల తరువాత ఆమె స్వదేశానికి తిరిగి వస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అయితే రెగ్యులర్ మెడికల్ చెకప్ కోసమే వెళ్లినట్టు ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూరెజ్ వాలా ఢిల్లీ చెప్పారు. గతంలో కూడా వైద్య పరీక్షల నిమిత్తం సోనియా అమెరికాకు వెళ్లిన విషయం విదితమే. 2011లో అమెరికాలో సోనియా సర్జరీ చేయించుకున్నారు. మళ్లీ 2012 సెప్టెంబర్, 2013 ఫిబ్రవరి, సెప్టెంబర్ లో వైద్య పరీక్షల నిమిత్తం సోనియా యూఎస్ వెళ్లిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News