: ముంబైలో ‘లోక్ మత్’పై ముస్లిం యూత్ దాడి...ఐఎస్ పై కథనమే కారణమట!


మహారాష్ట్ర రాజధాని ముంబైలో నిన్న ముస్లిం యువత రెచ్చిపోయింది. నడిరోడ్డుపైకి వచ్చి ఏకంగా ఓ ప్రముఖ దినపత్రిక కార్యాలయంపై దాడికి దిగింది. ఊహించని ఈ పరిణామంతో పోలీసులు వేగంగా స్పందించారు. ఈ ఘర్షణ మరింత పెద్దది కాకముందే అణచివేశారు. వివరాల్లోకెళితే...ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులపై ప్రముఖ మరాఠా దినపత్రిక ‘లోక్ మత్’ నిన్న తన సండే స్పెషల్ లో ఓ కథనాన్ని ప్రచురించింది. ‘‘ఐఎస్ఐఎస్ ఛా పైసా’’ (ఐఎస్ఐఎస్ ధనం) పేరిట రాసిన ఆ కథనానికి ఓ కార్టూన్ ను కూడా జతచేసింది. ఈ కార్టూన్ తమను కించపరిచేదిగా ఉందంటూ కొంత మంది ముస్లిం యువకులు పత్రికా కార్యాలయంపై దాడికి దిగారు. అంతేకాక సదరు పత్రికకు సంబంధించిన ప్రతులను కాల్చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితి చేయి దాటిపోకముందు ముస్లిం యువతను అక్కడి నుంచి పంపించివేశారు. ముస్లిం యువతను అసహనానికి గురి చేసిన కథనంపై లోక్ మత్ పత్రిక సంపాదకులు ఆ తర్వాత క్షమాపణలు చెప్పారు.

  • Loading...

More Telugu News