: జీహెచ్ఎంసీలో టీడీపీ, బీజేపీ జెండాలను ఎగురవేస్తాం: ఎల్.రమణ
త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలు ఘన విజయాన్ని సాధిస్తాయని టీటీడీపీ నేత ఎల్.రమణ ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి గెలుపు ఖాయమని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టానుసారం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కరవు మండలాలను ఇష్టం వచ్చినట్టు ప్రకటించారని... వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఒక్క కరవు మండలాన్ని కూడా ప్రకటించలేదని విమర్శించారు. రైతులు, కూలీల గురించి ఆలోచించే తీరిక కూడా ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. ఆత్మహత్యలకు పాల్పడిన 1800 రైతు కుటుంబాలకు వెంటనే ఎక్స్ గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు.