: లొంగిపోయిన చింటూ రాయల్... చిత్తూరు జిల్లా కోర్టులో లొంగుబాటు


తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్ హత్య కేసులో కీలక నిందితుడు చింటూ రాయల్ అలియాస్ శ్రీరామ చంద్రశేఖర్ లొంగిపోయాడు. ఓ వైపు పోలీసులు అతడి కోసం ముమ్మర గాలింపు కొనసాగిస్తుండగానే అతడు చిత్తూరులోని జిల్లా కోర్టులో కొద్దిసేపటి క్రితం లొంగిపోయాడు. కేసులో సంబంధం ఉందని భావిస్తున్న చింటూ ప్రధాన అనుచరులు ముగ్గురిని పోలీసులు మీడియా ముందు ప్రవేశపెడుతున్న సమయంలోనే చింటూ కోర్టులో లొంగిపోవడం గమనార్హం. చింటూ రాయల్ లొంగుబాటుతో కఠారి మోహన్ దంపతుల కేసు ఓ కొలిక్కి వచ్చినట్లేనన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.

  • Loading...

More Telugu News