: ఆ విషయం ఎల్ఎల్ బీ చదువుకున్న వారందరికీ తెలుసు: రామ్ జెఠ్మలానీ


పార్లమెంటు సర్వాధికారి కాదని బీజేపీ మాజీ నేత, ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానీ స్పష్టం చేశారు. పార్లమెంటు తీసుకున్నదే తుది నిర్ణయం కాదని... పార్లమెంటు నిర్ణయాలను కోర్టులో సవాలు చేయవచ్చని చెప్పారు. 'జాతీయ న్యాయ నియామకాల కమిషన్'ను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడాన్ని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ విమర్శించడాన్ని జెఠ్మలానీ తప్పుబట్టారు. కొచ్చిలో జరిగిన 1860 ఇండియన్ పీనల్ కోడ్ 155వ వార్షికోత్సవంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటే సర్వాధికారా అనే విషయాన్ని ప్రధానమంత్రినే అడగండని సూచించారు. పార్లమెంటే సర్వాధికారి కాదనే విషయం ఎల్ఎల్ బీ చదివిన ప్రతి ఒక్కరికీ తెలుసని చెప్పారు.

  • Loading...

More Telugu News