: మేయర్ దంపతుల హత్య కేసులో పురోగతి
చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త మోహన్ ల హత్య కేసులో చిత్తూరు పోలీసులు పురోగతి సాధించారు. కేసుకు సంబంధించి మరో ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. పరంధామ, హరిదాస్, మురగలను అరెస్ట్ చేశారు. వారి అరెస్టుతో ఇప్పటి వరకు పోలీసులు అదుపులోకి తీసుకున్న వారి సంఖ్య ఏడుకు చేరింది. మరోవైపు, కేసులో కీలక నిందితుడు చింటూతో పాటు వెంకటేష్, మొగిలి కోసం కర్ణాటకలో పోలీసులు గాలింపు చేపట్టారు. కేసులో కీలక నిందితుడైన చింటూ... కఠారి మోహన్ కు స్వయానా మేనల్లుడే అన్న తెలిసిందే.