: పటేల్ ప్రధాని అయ్యుంటే... భారత్ మరో పాకిస్థాన్ అయ్యేది!: కంచె ఐలయ్య సంచలన వ్యాఖ్య
దేశానికి తొలి ఉప ప్రధానిగా, హోమ్ మంత్రిగా వ్యవహరించిన సర్దార్ పటేల్ పై దళిత నేత, ప్రముఖ రచయిత కంచె ఐలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. పటేల్ దేశానికి తొలి ప్రధాని అయి ఉంటే, భారత్ కూడా మరో పాకిస్థాన్ లా మారేదని ఆయన వ్యాఖ్యానించారు. నిన్న దేశ రాజధాని ఢిల్లీలో ‘టైమ్స్ లిట్ ఫెస్ట్’ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఐలయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాక, రాజ్యాంగ రచన కోసం సమాయత్తమవుతున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ను అడ్డుకునేందుకు పటేల్ శాయశక్తులా యత్నించారని కూడా ఐలయ్య ఆరోపించారు. హిందూ మహాసభతో అత్యంత సన్నిహితంగా మెలగిన పటేల్, రాజ్యాంగాన్ని మనుస్మృతిని నమ్మినవారు మాత్రమే రాయాలని కూడా వాదించారట. కంచె ఐలయ్య చేసిన ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపే అవకాశాలున్నాయి.