: ఇండియాకు వెళ్లొచ్చు... రక్షణ ఉంది: రష్యా


విదేశాలకు వెళ్లే టూరిస్టులకు రక్షణ ఉన్న దేశాల జాబితా నుంచి భారత్ ను తొలగించలేదని రష్యా అధికారి ఒకరు తెలిపారు. రష్యన్లకు అత్యంత భద్రత ఉన్న దేశాల్లో ఇండియా ఒకటని గోవాలోని రష్యన్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అధికారి ఎకతిరినా బెల్యకోవా వెల్లడించారు. ఇండియాను గానీ, గోవాను గానీ రక్షణాత్మక దేశాల జాబితా నుంచి రష్యా తొలగించలేదని, అసలు ఈ విషయమే రష్యాలో చర్చకు రాలేదని ఓ ప్రకటనలో తెలిపారు. కాగా, నిన్న భారత్ ను రెడ్ లిస్టులో పెట్టినట్టు ఇంటర్ ఫ్యాక్స్ న్యూస్ ఏజన్సీ ప్రకటించగా, గోవాలో కలకలం చెలరేగిన సంగతి తెలిసిందే. గోవా ప్రభుత్వానికి రష్యన్ టూరిస్టర్ల నుంచి వచ్చే ఆదాయం కీలకం. ఇండియాకు వచ్చే రష్యన్లలో 50 శాతానికి పైగా గోవాను సందర్శిస్తుంటారు.

  • Loading...

More Telugu News