: ఏపీకి వరద సాయమేది?... స్పీకరుకు నోటీసులిచ్చిన టీడీపీ ఎంపీలు


ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తుతుంటే, కేంద్రం వరద సాయం చేయడం లేదని ఆరోపిస్తూ, ఈ అంశంపై తక్షణం చర్చకు అనుమతించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ ఎంపీలు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కు ఈ ఉదయం నోటీసులు ఇచ్చారు. రాష్ట్రానికి ఆర్థిక సాయం చేయాలని కోరిన వారు, చిత్తూరు, నెల్లూరు, కడప, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగిన పంట నష్టాన్ని వెల్లడించారు. వరదలకు కొట్టుకుపోయిన జాతీయ రహదారుల మరమ్మతు పనులకు నిధులందించాలని వారు విన్నవించారు. ఈ నోటీసులపై చర్చకు అనుమతించాలా? వద్దా? అన్న విషయమై, పార్లమెంట్ సమావేశాలు మొదలైన తరువాత స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు.

  • Loading...

More Telugu News