: ఇక రెండు చోట్ల ఓటుంటే పోలీసు కేసు, అరెస్ట్!


త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్ల జాబితాను పకడ్బందీగా తయారు చేయాలని అధికారులు భావిస్తున్నారు. గ్రేటర్ పరిధిలో ఓటుండి, మరోచోట కూడా ఓటు హక్కును అనుభవిస్తున్న వారిని టార్గెట్ చేయాలని కమిషనర్ జనార్దన్ రెడ్డి అధికారులకు సూచించారు. రెండు ఓట్లున్నవారు తక్షణం ఒక ఓటు తొలగించుకోవాలని, లేకుంటే కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేయిస్తామని వెల్లడించారు. చాలా మందికి రెండు చోట్ల పేర్లు ఉన్నట్టు తమ పరిశీలనలో వెల్లడైందని అధికారులు జనార్దన్ రెడ్డికి వెల్లడించగా, ఈ తరహా ఘటనలను సీరియస్ గా తీసుకోవాలని చెప్పారు. నోటిఫికేషన్ వచ్చేలోగా కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం ఉంటుందని తెలిపారు.

  • Loading...

More Telugu News