: అబార్షన్లకు వ్యతిరేకంగా గర్జించిన తుపాకీ!
అమెరికాలోని కొలరాడోలో ఓ ఆసుపత్రిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి ముగ్గురి మరణానికి కారణమైన రాబర్ట్ లూయిస్ డియర్ (57), తాను ఆ దారుణానికి ఎందుకు ఒడిగట్టాడో పోలీసు విచారణలో వెల్లడించాడు. ఆ ఆసుపత్రిలోని డాక్టర్లు విచ్చలవిడిగా అబార్షన్లు చేస్తున్నందునే కాల్పులు జరిపినట్టు అతను చెప్పినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. తనను అదుపులోకి తీసుకున్న తరువాతైనా ఆసుపత్రిలో గర్భవిచ్ఛిత్తి కార్యకలాపాలు ఆగుతాయని భావిస్తున్నట్టు రాబర్ట్ చెప్పినట్టు తెలుస్తోంది. అతను వాడిన ఆయుధం, కాల్పులు జరిపిన కారణాలపై అధికారిక సమాచారం వెలువడాల్సి వుంది. కాగా, ఇదే ఆసుపత్రిలో పిల్లల శరీర అవయవాలను అమ్ముతున్నారని, ఓ స్టింగ్ ఆపరేషన్ వీడియో గత జూలైలో విడుదలైన సంగతి తెలిసిందే.