: చాపెల్ బ్రదర్స్ పై సచిన్ ‘బ్లాస్ట్’... గ్రెగ్ భారత్ క్రికెట్ ను ఐదేళ్లు వెనక్కు తీసుకెళ్లాడని వ్యాఖ్య!


ఇయాన్ చాపెల్, గ్రెగ్ చాపెల్... ఆస్ట్రేలియా క్రికెట్ లో పేరొందిన ఆటగాళ్లు. క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత ఇయాన్ వ్యాఖ్యతగా స్థిరపడగా, గ్రెగ్ చాపెల్ భారత క్రికెట్ జట్టు కోచ్ గా చాలాకాలం పాటు పనిచేశాడు. గ్రెగ్ కోచ్ గా ఉన్న సమయంలోనే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరించాడు. అయితే, నాడు చాపెల్ నుంచి సచిన్ కు పెద్దగా సహకారం లభించలేదన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. సాధారణంగా శాంత స్వభావి అయిన సచిన్ నాడు చాపెల్ బ్రదర్స్ పై విరుచుకుపడ్డాడు. అయితే అకారణంగా ఏమీ కాదులెండి. ఇయాన్ చాపెల్ తనపై ముఖాముఖిగా చేసిన వ్యాఖ్యలతో సహనం నశించిన సచిన్... అతడికి ఘాటుగానే సమాధానం చెప్పాడు. ‘‘పరిస్థితులను బట్టి మాట మార్చడంలో మీకు మీరే సాటి. అసలు సమస్యలకు మీ సోదరుడే కారణం. గ్రెగ్ కోచ్ గా ఉన్న సమయంలో భారత క్రికెట్ ఐదేళ్లు వెనక్కెళ్లిపోయింది’’ అని సచిన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. గ్రెగ్ కోచ్ గా ఉన్న సమయంలో పలు పత్రికల్లో ప్రత్యేెక కాలమ్ లు రాసే క్రమంలో ఇయాన్ భారత క్రికెట్ నే కాక సచిన్ ను కూడా తక్కువ చేసి రాసేవాడు. ఈ క్రమంలో డర్బన్ లో వర్కవుట్లు చేస్తున్న క్రమంలో సచిన్ ను లక్ష్యంగా చేసుకుని ‘‘నీ విజయ రహస్యం ఇదన్న మాట’’ అంటూ నోరు జారాడట. దీంతో సహనం నశించిన సచిన్ ఇయాన్ కు ఘాటుగానే బదులిచ్చాడట. ‘అన్ నోన్ సచిన్ టేప్స్’ పేరిట శనివారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా ఈ ఆసక్తికర అంశం వెలుగుచూసింది.

  • Loading...

More Telugu News