: హస్తినకు టీ కాంగ్ ముఖ్యులు...వరంగల్ ఓటమి, గ్రేటర్ ఎన్నికలపై సోనియాతో సమాలోచనలు


కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ ముఖ్య నేతలు నేడు ఢిల్లీకి వెళుతున్నారు. టీ పీసీపీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు తెలంగాణ అసెంబ్లీలో సీఎల్పీ నేత జానారెడ్డి, పార్టీ ముఖ్య నేత షబ్బీర్ అలీ తదితరులు నేటి మధ్యాహ్నం పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఇటీవల వరంగల్ లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఘోర పరాజయంపై వారు సోనియాకు వివరణ ఇవ్వనున్నట్లు సమాచారం. అంతేకాక పార్టీ సీనియర్ నేత కిష్టారెడ్డి హఠాన్మరణం నేపథ్యంలో త్వరలో మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ ఎన్నికలు, ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు తదితరాలపై వారు పార్టీ అధినేత్రితో చర్చించనున్నారు. రాష్ట్రంలో పార్టీ భవిష్యత్ ప్రణాళికకు సంబంధించి సోనియా గాంధీ వారికి దిశానిర్దేశం చేయనున్నట్లు కూడా తెలుస్తోంది. అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చిన నేపథ్యంలోనే వారంతా ఢిల్లీ పయనమవుతున్నారని సమాచారం.

  • Loading...

More Telugu News