: డిగ్గీ రాజా రికార్డును బద్దలుకొట్టిన శివరాజ్ సింగ్!
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ పేరిట ఉన్న రికార్డు బద్దలైంది. 1993 నుంచి 2003 మధ్యకాలంలో దిగ్విజయ్ పదేళ్ల పాటు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు, ఆ రికార్డును ప్రస్తుత మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ అధిగమించారు. ఆయన ముఖ్యమంత్రి స్థానాన్ని అధిష్టించి ఈ రోజుతో పదేళ్లు పూర్తి చేసుకున్నారు. దీంతో మధ్యప్రదేశ్ లో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న కాంగ్రెసేతర సీఎంగా శివరాజ్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. 2005లో తొలిసారిగా ముఖ్యమంత్రి బాధ్యతలను ఆయన చేపట్టారు.