: ప్రతివిషయాన్ని సెన్సేషన్ చేయద్దు: జర్నలిస్టులకు గవర్నర్ సూచన
'జర్నలిస్టులూ.. ప్రతి విషయాన్ని సెన్సేషన్ చేయకండి' అంటూ గవర్నర్ నరసింహన్ సూచించారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ స్వర్ణోత్సవాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలో విలేకరుల పాత్ర ఎంతో కీలకమైనదన్నారు. ఏ రంగంలోనైనా సరే, లోటుపాట్లు ఉంటే మీడియా ఎత్తి చూపాలే తప్పా, సంచలనాల కోసం చూడద్దని అన్నారు. ‘విమర్శలు చేయండి, కాకపోతే, అవి నిర్మాణాత్మకంగా ఉండాలి’ అని అన్నారు. మీడియా బాధ్యతాయుతంగా ఉండటమే కాకుండా అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని నరసింహన్ అన్నారు.