: విండీస్ స్పిన్నర్ నరైన్ పై ఐసీసీ వేటు!


వెస్టిండీస్ స్పిన్నర్ సునీల్ నరైన్పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వేటు వేసింది. నరైన్ బౌలింగ్ శైలి నిబంధనలకు విరుద్ధంగా ఉందని తేలడంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. నరైన్ బౌలింగ్ చేసే క్రమంలో తన మోచేతిని ఎక్కువగా వంచుతున్నాడంటూ అంపైర్లు ఇటీవల ఐసీసీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అతని బౌలింగ్ యాక్షన్ను ఐసీసీ బృందం పరిశీలించిన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. కాగా, గత నెలలో శ్రీలంకతో మూడో వన్డే సందర్భంగా నరైన్ బౌలింగ్ తీరుపై అంపైర్లు అనుమానం వ్యక్తం చేశారు. తన మోచేతిని 15 డిగ్రీల కంటే ఎక్కువగా వంచుతున్నాడంటూ ఐసీసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News