: ‘ఓటుకు నోటు’ నుంచి నిర్దోషిగా బయటపడతా: మత్తయ్య
ఓటుకు నోటు కేసు నుంచి తాను నిర్దోషిగా బయటపడతానని జెరూసలెం మత్తయ్య ధీమా వ్యక్తం చేశారు. విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎఫ్ఎస్ఎల్ నివేదికలో తన పేరు ఉన్నంత మాత్రాన తాను దోషిని కానని, నిర్దోషిగా బయటపడతానని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ నేతల నుంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్సార్సీపీ నేతల నుంచి తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఆయన ఆరోపించారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బంది పడాలని కొంతమంది కోరుకుంటున్నారనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సఖ్యతతో మెలగాలని తాను కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. దళిత క్రైస్తవుల సమస్యలపై పోరాటం చేస్తానని మత్తయ్య వెల్లడించారు.