: సల్మాన్ తో ‘దిల్ వాలే’ జంట!
బాలీవుడ్ హీరో, కండలవీరుడు సల్మాన్ ఖాన్ తో ‘దిల్ వాలే’ జంట దిగిన ఫొటో ఒకటి ట్విట్టర్లో దర్శనమిస్తోంది. ‘దిల్ వాలే’ జంట వరుణ్ ధావన్, కృతి సనన్ పై చిత్రీకరించిన 'మన్మా ఎమోషన్స్' పాట ఇటీవల విడుదలైంది. కేవలం 24 గంటల్లో సుమారు 25 లక్షల హిట్స్ ను ఇది సాధించింది. ఈ నేపథ్యంలో ఈ జంట ఇటీవల బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా సల్మాన్ తో వాళ్లిద్దరూ తమ ఆనందం పంచుకున్నారు. ఈ విషయాన్ని వరుణ్ ధావన్ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. డిసెంబర్ 18న ఈ చిత్రం విడుదల కానుంది.