: కోల్ కతాలో స్కూటరెక్కిన అమితాబ్ !
బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్ స్కూటరెక్కారు. కోల్ కతా వీధుల్లో స్కూటర్ పై ఆయన తిరిగారు. చక్కగా హెల్మెట్ పెట్టుకుని ఉన్న అమితాబ్ ముదురు రంగు ఫ్యాంట్ పై గళ్ల చొక్కా తొడుక్కుని ఉన్న ఈ దృశ్యం కోల్ కతాలోని రైటర్స్ బిల్డింగ్ వద్ద శనివారం నాడు దర్శనమిచ్చింది. రిబూ దాస్ గుప్తా దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం 'తీన్' షూటింగ్ కోసం అమితాబ్ స్కూటరెక్కాల్సి వచ్చింది. ఈ చిత్రంలో విభిన్న పాత్రను బిగ్ బీ పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోల్ కతాలో షూటింగ్ జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడి సూచనల మేరకు ఆయన స్కూటర్ నడిపారు. ఈ విషయాన్ని ఆయన ట్వీట్ చేశారు. ‘కొత్త ఆలోచనతో రూపొందుతున్న కొత్త చిత్రం 'తీన్'. 'పీకూ' చిత్రం కోసం నాడు సైకిల్ తొక్కాను... తీన్ చిత్రం కోసం నేడు స్కూటర్ నడుపుతున్నాను’ అని ఆ ట్వీట్ లో అమితాబ్ పేర్కొన్నారు. ఈ ట్వీట్ తో పాటు కొన్ని ఫొటోలను కూడా పోస్ట్ చేశారు.