: బియ్యానికి బదులు ప్లాస్టిక్ బియ్యం.. సూపర్ మార్కెట్ లో మోసం!


బియ్యం బస్తా కొనుగోలు చేసేందుకు వెళ్లిన ఒక వినియోగదారుడికి చేదు అనుభవం ఎదురైంది. ఆ బస్తాలో బియ్యంకు బదులు ప్లాస్టిక్ బియ్యం ఉన్నాయి. దీంతో తనను మోసం చేశారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఈ సంఘటన హైదరాబాద్ లోని నాగోల్ మోర్ సూపర్ మార్కెట్ లో జరిగింది. బండ్లగూడకు చెందిన శ్రీనివాస్ ఆ సూపర్ మార్కెట్ లో 25 కిలోల బియ్యం బస్తాను కొని, ఇంటికెళ్లి బస్తా తెరిచి చూసి నిర్ఘాంతపోయాడు. అందులో బియ్యానికి బదులు ప్లాస్టిక్ బియ్యం ఉండటంతో బాధితుడు సూపర్ మార్కెట్ ఎదుట ఆందోళనకు దిగాడు.

  • Loading...

More Telugu News