: బాక్సింగ్ లో సరికొత్త చరిత్ర!... వ్లాదిమిర్ క్లిచ్ ను మట్టికరిపించిన టైసన్ ఫ్యూరీ


బాక్సింగ్ చరిత్రలో సరికొత్త చరిత్ర ప్రారంభమైంది. బాక్సింగ్ క్రీడా చరిత్రలో గత 11 ఏళ్లుగా ఓటమి ఎరుగని యోధుడు వ్లాదిమిర్ క్లిచ్ కో(ఉక్రెయిన్) ను టైసన్ ఫ్యూరీ(బ్రిటన్) కంగుతినిపించాడు. డ్యూసెలదార్ఫ్ లో శనివారం జరిగిన పోరులో టైసన్ ఫ్యూరీ 115-112, 115-112, 116-111 తేడాతో వ్లాదిమిర్ ను మట్టి కరిపించాడు. ఆద్యంతం హోరాహోరీగా సాగిన పోరులో టైసన్ ఫ్యూరీ విజయం సాధించాడు. ఈ సందర్భంగా ఫ్యూరీ మాట్లాడుతూ, గత కొంత కాలం నుంచి తాను పడ్డ శ్రమకు తగిన ఫలితం దక్కిందన్నాడు. ఇప్పటివరకూ 25 ప్రొఫెషనల్ బౌట్లను తాను గెలుచుకున్నానని, వరల్డ్ హెవీ వెయిట్ చాంపియన్ గా నిలవాలన్నది ఓ కల అంటూ ఫ్యూరీ ఆనంద బాష్పాలు రాల్చాడు. ఇదిలా ఉండగా, ఫ్యూరీ వేగం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని, త్వరలో తన రిటైర్మెంట్ పై నిర్ణయం వెలువడే అవకాశం ఉందని వ్లాదిమిర్ తెలిపాడు.

  • Loading...

More Telugu News