: ప్రతిభను గుర్తించే వారే ఉండరనడం నిజం కాదు: అమితాబ్


హిందీ సినీ పరిశ్రమలో ప్రతిభను గుర్తించేవారే ఉండరని అనడం నిజం కాదని, ఈ విషయాన్ని నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ రుజువు చేశారని బాలీవుడ్ అగ్ర హీరో అమితాబ్ బచ్చన్ అన్నారు. నవాజుద్దీన్ సిద్దిఖీ నటన అద్భుతమని బిగ్ బీ ప్రశంసించారు. ఓ ఇంటర్వ్యూలో అమితాబ్ మాట్లాడారు. అతని ప్రతిభ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక అద్భుతమన్నారు. బజరంగీ భాయ్ జాన్ చిత్రంలో నవాజుద్దీన్ సిద్దిఖీ తన నటన ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత 'మాంఝీ' చిత్రంలో హీరోగా నటించి తన నటనా విశ్వరూపంతో ప్రేక్షకులను ఆయన ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కాగా, సుజయ్ ఘోష్ దర్శకత్వం వహిస్తున్న 'తీన్' సినిమాలో అమితాబ్ తో కలిసి నవాజుద్దీన్ సిద్దిఖీ ఒక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ కోల్ కతాలో జరుగుతోంది. ‘తీన్’లో విద్యాబాలన్ కూడా నటిస్తోంది.

  • Loading...

More Telugu News