: భారత జవాన్లను విడిచిపెట్టిన నేపాల్ పోలీసులు
అదుపులోకి తీసుకున్న భారత సైనికులను నేపాల్ పోలీసులు విడిచిపెట్టారు. తమ దేశంలోకి అక్రమంగా చొరబడ్డారని ఆరోపిస్తూ 13 మంది సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) సిబ్బందిని నేపాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, దీనిపై వెంటనే స్పందించిన భారత సైన్యాధికారులు నేపాల్ అధికారులతో చర్చలు జరపడంతో వారిని విడిచిపెట్టారు. ఈ విషయాన్ని నేపాల్ అధికారులు వెల్లడించారు. కాగా, డీజిల్ స్మగ్లర్లను వెంబడిస్తూ ఎస్ఎస్బీ కి చెందిన ఇద్దరు సైనికులు నేపాల్ లోని జపా అనే గ్రామంలోకి ప్రవేశించారు. అయితే, వారి వద్ద ఆయుధాలు ఉండడంతో పోలీసులు వారిని పట్టుకున్నారు. వారిద్దరిని తీసుకొచ్చేందుకని మరో పది మంది సైనికులు అక్కడికి వెళ్లారు. వారిని కూడా అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.