: భారతీయ రైల్వేలకు మహర్దశ: మోర్గాన్ స్టాన్లీ


రైల్వే మంత్రి సురేష్ ప్రభు వేస్తున్న ప్రణాళికల మేరకు నిధులు అందించగలిగితే భారతీయ రైల్వేలు మహర్దశలో పరుగులు పెడతాయని ప్రముఖ ఇన్వెస్ట్ మెంట్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ తన తాజా రిపోర్టులో వెల్లడించింది. వచ్చే ఐదేళ్లలో రైల్వేలకు వెచ్చించనున్న మొత్తాన్ని 285 శాతం పెంచుతూ, 132 బిలియన్ డాలర్లు (సుమారు సుమారు రూ. 8.70 లక్షల కోట్లు) వెచ్చించాలని తీసుకున్న నిర్ణయంతో రైల్వే శాఖ శరవేగంగా మారనుందని తెలిపింది. భారత్ లో కొత్త రైల్వే ప్రాజెక్టులు, హైస్పీడ్ రైళ్లు రానున్నాయని, దీంతో రవాణా వ్యవస్థ కొత్త పుంతలు తొక్కుతుందని అంచనా వేసింది. ప్రస్తుతం రైల్వేలు మాధ్యమంగా సాగుతున్న రవాణాతో పోలిస్తే ఒకటిన్నర రెట్లు అధికంగా రహదారి మార్గాల్లో రవాణా జరుగుతున్నప్పటికీ, భవిష్యత్తులో రోడ్డు మార్గాల నుంచి సరకు రవాణా మరింతగా రైల్వేలకు మళ్లుతుందని మోర్గాన్ స్టాన్లీ భారత రీసెర్చ్ విభాగం హెడ్ రిధమ్ దేశాయ్ వెల్లడించారు. వచ్చే ఐదేళ్లూ భారత రైల్వే వ్యవస్థ మార్పునకు కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News