: తప్పు సరిదిద్దుకునేందుకు ఎన్నేళ్లు కావాలి?: చిదంబరాన్ని అడిగిన సాల్మన్ రష్దీ


ప్రముఖ రచయిత సాల్మన్ రష్దీ రాసిన 'ది శటానిక్ వర్సెస్' పుస్తకాన్ని నిషేధించి, ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీ తప్పు చేశారని మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం చేసిన వ్యాఖ్యలపై రష్దీ స్పందించారు. "తప్పును అంగీకరించేందుకు 27 సంవత్సరాలు పట్టింది. ఇక దాన్ని సరిదిద్దుకునేందుకు ఎంత కాలం పడుతుంది?" అని ఆయన ట్వీట్ చేశారు. కాగా, ఈ వివాదాస్పద పుస్తకం 1988లో విడుదల కాగా, ఓ ఇరాన్ మత పెద్ద అయాతుల్లా ఖోమైనీ, దీన్ని తీవ్రంగా వ్యతిరేకించి రష్దీని హత్య చేయాలంటూ ఫత్వా జారీ చేయడంతో ఎన్నో దేశాలు ఆయన పుస్తకాన్ని నిషేధించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News