: రోజురోజుకూ ఆటవికులుగా మారుతున్న ముస్లింలు: డొనాల్డ్ ట్రంప్


ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు రోజురోజుకూ ఆటవికులుగా మారుతూ, ఇతర వర్గాలకు ప్రమాదకరమవుతున్నారని అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ల తరఫున పోటీ పడతారని భావిస్తున్న డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. న్యూయార్క్ పై విమానాలతో ఉగ్రవాదులు దాడులు చేసిన వేళ ఎంతో మంది ముస్లింలు వాటిని సమర్థించారని, మియామీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో అన్నారు. ముస్లింలు ఆటవికంగా మారుతున్నారన్న విషయాన్ని అందరూ అంగీకరిస్తున్నారని అన్నారు. ఇస్లాం మతాన్ని ఆచరించడమే ధ్యేయంగా పెట్టుకున్న యాసర్ అరాఫత్, లిబియాలో నియంతగా పేరుపడ్డ గడాఫీలు సైతం ఉగ్రవాదాన్ని పెంచాలని భావించలేదని, వారు అమెరికాపై దాడిని ఖండించారని గుర్తు చేశారు. కాగా, గత కొంతకాలంగా ట్రంప్ ముస్లింలకు వ్యతిరేకంగా పదేపదే మాట్లాడుతున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News