: టీ రూ.5కు అమ్ముతున్న వేళ... కిలో బియ్యం రూపాయికి ఎందుకిస్తున్నారు?: జేసీ మరో వివాదాస్పద వ్యాఖ్య
అనంతపురం పార్లమెంట్ సభ్యుడు, తెలుగుదేశం నేత జేసీ దివాకర్ రెడ్డి మరోమారు తనదైన శైలిలో వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియా ముందుకు వచ్చారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, పేదలకు రూపాయికే బియ్యం అందించడాన్ని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరూ టీ తాగేందుకు రూ. 5 వెచ్చిస్తున్న వేళ, కిలో బియ్యాన్ని రూపాయికే ఇవ్వాల్సిన అవసరం ఏంటని అడిగారు. రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్ కూడా తగ్గాలని అభిప్రాయపడ్డ ఆయన, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరారు. నిరుపేదల ఆకలి తీరుస్తున్న రూపాయికి కిలో బియ్యం పథకంపై, జేసీ వ్యాఖ్యలకు ఎటువంటి స్పందన వస్తుందో!