: భారత సైనికులను అదుపులోకి తీసుకున్న నేపాల్... సరిహద్దుల్లో ఉద్రిక్తత


తమ దేశంలోకి అక్రమంగా చొరబడ్డారని ఆరోపిస్తూ, కొందరు భారత సైనికులను నేపాల్ పోలీసులు అరెస్ట్ చేయడంతో సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 13 మంది ఎస్ఎస్బీ జవాన్లు ఇండియా నుంచి నేపాల్ కు అక్రమంగా డీజిల్ ను తరలిస్తున్న ముఠాను వెంటాడుతూ సరిహద్దులు దాటినట్టుగా తెలుస్తోంది. వీరిని గమనించిన నేపాల్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న భారత ప్రభుత్వం నేపాల్ అధికారులతో వారి విడుదలకై సంప్రదింపులు జరుపుతోంది. సరిహద్దులు దాటిన భారత సైనికుల వద్ద కూడా అత్యాధునిక ఆయుధాలు ఉండటంతో కొంత సేపు యుద్ధ వాతావరణం నెలకొన్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News