: ఓ సినీ నటి సహా ఎంతో మంది ప్రపోజ్ చేశారు: ఆసక్తిని కలిగించిన రాందేవ్ బాబా కబుర్లు


ప్రస్తుతం తనకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరూ లేరని యోగా గురువు రాందేవ్ బాబా స్పష్టం చేశారు. ఓ టీవీ చానల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆసక్తికర అంశాలను వెల్లడించారు. తాను అన్ని ఇహపరమైన సుఖాలనూ త్యజించి సన్యాసిగా మారిన తరువాత కూడా ఎంతో మంది అమ్మాయిలు ప్రపోజ్ చేశారని చెప్పారు. ఓ ప్రోగ్రామ్ లో పాల్గొన్న తన వద్దకు ప్రముఖ సినీ నటి సైతం వచ్చి, తన మనసులోని కోరికను వెల్లడించిందని, ఆమె శైలి చూసి తాను పారిపోయానని తెలిపారు. ఆ నటి పేరును మాత్రం రాందేవ్ వెల్లడించలేదు. మరోసారి అమెరికా పర్యటనలో ఉండగా, ఓ మహిళ తన వద్దకు వచ్చి ఏకాంతంగా మాట్లాడాలని కోరిందని, తన సర్వస్వాన్ని అర్పిస్తానని ప్రాధేయపడుతున్నట్టు చెప్పిందని, తాను మాత్రం గప్ చుప్ గా అక్కడి నుంచి వెళ్లిపోయానని అన్నారు.

  • Loading...

More Telugu News