: బాలుడిపై లైంగిక వేధింపుల కేసులో అమెరికన్ టూరిస్టర్ అరెస్ట్
కోల్ కతాలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో 14 ఏళ్ల బాలుడిపై లైంగిక వేధింపులు జరిపాడన్న అభియోగాలపై అమెరికా నుంచి వచ్చిన ఓ పర్యాటకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఓ సామాజిక మాధ్యమ వెబ్ సైట్ ద్వారా ఆ బాలుడు అంతకుముందే టూరిస్టర్ కు పరిచయమయ్యాడు. హోటల్ లో చెకిన్ అయిన తరువాత బాలుడిని తన గదిలోకి పిలిచిన టూరిస్టర్ అతనితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆపై డబ్బిచ్చి పంపాడు. హోటల్ జనరల్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతన్ని అరెస్ట్ చేసినట్టు వివరించారు. బాలుడిని కూడా విచారించగా, జరిగిన ఘటనలను పూసగుచ్చినట్టు తెలిపాడని పోలీసులు వెల్లడించారు.