: 12 మందిని కనాలనుకున్నాం, ఆరుగురితోనే అస్తవ్యస్తమయ్యాం: బ్రాడ్ పిట్, ఏంజలినా జోలీ
తమ మనసులో 12 మంది పిల్లలను కనాలన్న కోరిక బలంగా ఉన్నప్పటికీ, ఆరుగురితోనే తమ జీవితం అస్తవ్యస్తమైందని హాలీవుడ్ సెలబ్రిటీ జంట బ్రాడ్ పిట్, ఏంజలినా జోలీలు అంటున్నారు. "వినండి... నేనూ జూలీ డజను మంది పిల్లల్ని కనాలని అనుకున్నాం. కానీ ఆరుగురితోనే ఆపేశాం" అని డైలీ టెలిగ్రాఫ్ దినపత్రికకు బ్రాడ్ పిట్ వెల్లడించాడు. "మా కుటుంబంలో ఎంతో ప్రేమ ఉంది. నిత్యమూ యుద్ధం జరుగుతుంటుంది. అంతా కలగాపులగం, ఎంతో అస్తవ్యస్తం. అందులో ఆనందం ఉంది సుమా" అని అన్నాడు. కాగా, ఈ జంటకు మాడాక్స్ (14), పాక్స్ (11), జహారా (10), షిలోహ్ (9) లతో పాటు 7 సంవత్సరాల కవలలు నాక్స్, వివైనీలు జన్మించిన సంగతి తెలిసిందే.