: భార్యను కౌగిలిలో బంధించి, కారు బాంబును పేల్చిన భర్త... రష్యా ఎంపీ దుర్మరణం!


తన భార్య, రష్యాలో అధ్యక్షుడు పుతిన్ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యురాలు ఒక్సానా బాబ్రోవస్కయా (30)తో కారులో లైంగిక చర్య జరుపుతున్న ఆమె భర్త, అదే కారులో అమర్చిన బాంబును పేల్చడంతో వారిద్దరూ దుర్మరణం చెందారు. ఈ ఘటన సైబీరియా పరిధిలోని నోవోసిబ్రిస్క్ సమీపంలో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఘటనకు ముందు వీరిద్దరి మధ్యా వాగ్వాదం జరిగి ఉండవచ్చని, అక్రమ సంబంధమే ఒక్సానా భర్త ఇంతటి దారుణ నిర్ణయం తీసుకోవడానికి కారణమై ఉండవచ్చని తెలుస్తోంది. ఇద్దరి శరీరాలూ కారు వెనుక సీట్లో దాదాపు నగ్నంగా పడివున్నాయి. బాంబు ధాటికి ఇద్దరి తలలూ ఛిద్రమయ్యాయని, కారు అద్దాలు పూర్తి ఎరుపు రంగులోకి మారాయని, ఇదో హృదయ విదారక ఘటనని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాగా, ఒక్సానా భర్త గతంలో రష్యా సైన్యంలో ప్రత్యేక సేవల అధికారిగా పనిచేశారు.

  • Loading...

More Telugu News